సెరికల్చర్ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. పట్టు పురుగుల పంట కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. రూ.800లు ధర ఉండే ఒక్కో పట్టుగుడ్లలో దాదాపు 500ల పిల్లలు ఉంటాయి. నల్లని వస్త్రాలపై వీటిని పొదగాలి. వీటి పెంపకం 5 దశల్లో ఉంటుంది. పట్టుపురుగులు మల్బరీ ఆకులను తింటాయి. పెరిగిన పట్టు పురుగులు కిలో రూ.750కు రైతులు విక్రయిస్తున్నారు. 250 గుడ్లతో రైతులు పట్టుపురుగులు పెంచితే నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.