నిరుద్యోగుల కోసం కేంద్రం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) అమలు చేస్తోంది. సూక్ష్మ, కుటీర పరిశ్రమలతో పాటు మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల వారికి 35 శాతం, పట్టణ ప్రాంతాల వారికి 25 శాతం సబ్సిడీ ఉంటుంది. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.