గణపతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పండగ పూట దేవుడిని చూసే భాగ్యం కూడా ప్రజలకు లేదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని భగవంతుడిని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతల్ని అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. దేవుడికి బాధలు చెప్పే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని ప్రశ్నించారు. పోలీసులు కూడా చట్టాలు అతిక్రమించి ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు.