భారత చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై లోక్‌సభలో బుధవారం చర్చ జరగనుంది. ప్రస్తుతం భారత్ చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం 15.2 శాతం ఉంది. చట్టసభల్లో అత్యధికంగా మహిళల ప్రాతినిథ్యం ఉన్న దేశాలను పరిశీలిస్తే ఈ జాబితాలో రువాండా 61.3 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత క్యూబా 55.7, నికారాగ్వా 51.7, అండోరా 50, మెక్సికో 50, అంగోలా 33.6, ఉజ్బెకిస్థాన్ 33.6 శాతం కలిగి ఉన్నాయి.