రాజస్థాన్లోని పహాడీ సబ్ డివిజను పరిధిలో దారుణం జరిగింది. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాధారంగా మారిన వితంతువుకు ఉద్యోగం ఆశ చూపి చేరువైన ఓ వ్యక్తి.. తన అయిదుగురు స్నేహితులతో కలిసి ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి భరత్పుర్లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. బాధితురాలిని అక్కడే నిర్బంధించి ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడినుండి బయటపడ్డ ఆమె కామా పీఎస్ లో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేశారు.