స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు ఒక్కరాత్రిలో జరిగిపోయిన అంశం కాదని, పూర్తిస్థాయి దర్యాప్తు చేశాకే అరెస్ట్ చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఐడీ సహా ఆయా విభాగాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాయని తెలిపారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎలాంటి ఆందోళనా లేదని, ప్రభుత్వం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్రానికి కాదు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసుకున్నా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు.