రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో 250కి పైగా జనాభా కలిగిన ఆవాస ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతోపాటు పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) రుణ సహాయం చేసింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా దీనిలో బ్యాంకు రూ.3,418 కోట్లు రుణంగా అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1608 కోట్లను సమకూరుస్తోంది. ఈ మేరకు ఆ బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించి నాణ్యతను పరిశీలించింది. మంగళవారం విజయవాడలో సీఎస్ జవహర్‌రెడ్డితో సమావేశమై ప్రాజెక్టు పనులపై సంతృప్తిని వ్యక్తం చేసింది.