కడప జిల్లా, వాల్మీకిపురం పట్టణంలో స్థానిక తిరుపతి రోడ్డులో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... తిరుపతి రోడ్డులో నివాసం ఉంటున్న బి.రాజగోపాల్ నర్సరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాజగోపాల్ ఇంటి గేటు, తలుపుల తాళాలు పగులగొట్టి ఇంట్లోని బీరువాలు, కప్బోర్డులను ధ్వంసం చేసి 150గ్రాముల బంగారు నగలు, రూ.1.30లక్షలు నగదు దొంగలు అపహరించుకుపోయారు. సాయంత్రం విషయం తెలుసుకున్న రాజగోపాల్ చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక అదనపు ఎస్ఐ కృష్ణమూ ర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.