ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న నీర్జాంపల్లె గంగారాం (20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే....... లింగాల మండలం తేర్నాంపల్లెకు చెందిన దంపతులు నీర్జాంపల్లె గంగాధర్, నారాయణమ్మ , వీరి కుమారుడు గంగారాంకు 10వ తరగతిలో మంచిమార్కులు రావడంతో ట్రిపుల్ఐటీలో సీటుదక్కింది. సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో గంగారాం ఉరివేసుకున్నాడు. పక్కగది విద్యార్థులు గమనించి సెక్యూరిటీ సిబ్బందికి, ట్రిపుల్ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందాడు. మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇన్చార్జి సీఐ గోవిందరెడ్ఢి ఘటన స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించి విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.