గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాగంగా నార్త్ కన్వీనర్ కెకె రాజు మంగళవారం రాత్రి వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజుతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు.