తెనాలి పట్టణానికి చెందిన వెంకటప్రసాద్ (63) సోమవారం ఉదయం 6 గంటల సమయంలో వహాబ్ చౌక్ వద్ద పాల ప్యాకెట్లు కొనుగోలు చేస్తూ ఉండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇరువురు యువకులు ఆయన వద్ద ఉన్న ఫోన్ లాక్కుని పారిపోయారు. అనంతరం వెంకటప్రసాద్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 2 లక్షలు ఇతర ఖాతాలకు మళ్లించారు. బాధితుడు మంగళవారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa