రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేయనున్న గ్రూప్-1 నోటిఫికేషన్ పరీక్షల్లో కీలక మార్పులు చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉండగా, ప్రిలిమ్స్‌లో ఒక పేపర్ తొలగించి ఎక్కువ జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఉండేలా కొత్త తరహా ప్రశ్నావళిని రూపొందించాలని భావిస్తోంది. మెయిన్స్‌లో అర్హత పరీక్షలు కాకుండా ఐదు పేపర్లుంటాయి. వాటిని నాలుగు పేపర్లకి కుదించి , వాటిలో కూడా రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు పెట్టాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.