అనంతపురం జిల్లాలో ఈ నెల 20, 22, 26 తేదీలలో మూడు దశలలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని ఎస్పీ కేకేఎన అన్బురాజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20వ తేదీన 2,711 విగ్రహాలను నిమజ్జనం చేస్తారని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్టుగా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, విద్యుత, అగ్నిమాపక శాఖల సమన్వయంతో జిల్లా పోలీసుశాఖ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు, శాంతి కమిటీలు సంయుక్తంగా కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. వినాయక ప్రతిమల ఊరేగింపులో మద్యం తాగినవారు ఉండకుండా చూడాలన్నారు. వీలైనంత త్వరగా శోభాయాత్రలను ప్రారంభించి, త్వరగా ముగించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, లైటింగ్, వైద్య సిబ్బంది, ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గతంలో అల్లర్లు జరిగిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శోభాయాత్రలు జరిగే సమయంలో రౌడీషీటర్లు, నేర చరితులపై నిఘా కొనసాగించాలని అన్నారు. జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఈవ్ టీజింగ్, రౌడీల ఆగడాలపై తన ఫోన నంబర్ 9440796800కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.