సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కానీ మహిళల్ని సమానంగా చూస్తే సరిపోతుందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో చర్చలో భాగంగా ఆమె మాట్లాడారు. బిల్లులో ఉన్న వందనం అన్న పదాన్ని ఆమె తప్పుపట్టారు. భారతీయ చరిత్రలో ఎంతో మంది శక్తివంతమైన మహిళా నేతలు ఉన్నారని, ఆ జాబితాలో ఇందిరాగాంధీ, జయలలిత, సుష్మాస్వరాజ్ ఉన్నట్లు ఆమె చెప్పారు.