రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్పై అసోం సీఎం హిమంత బిస్వాశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెహ్లోట్ ఇప్పటికైనా తన డ్రామాలు మానుకోవాలన్నారు. ‘‘పేదలకు చూపుతున్న అభివృద్ధి, ఉపశమన డ్రామాకు గెహ్లోట్ స్వస్తి చెప్పి వారిని క్షమాపణలు కోరాలి. క్రైమ్‌లో అన్ని రాష్ట్రాలను బీట్ చేసి రాజస్థాన్ నెం.1గా నిలుస్తోంది. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ అగ్రస్థానం కోసం పోటీపడుతోంది’’అని ఆయన అన్నారు.