తన అనుమతి లేకుండా కొన్ని సంస్థలు, యాప్‌లు, వెబ్సైట్లు తన ఫొటోలు, వాయిస్, వీడియో, సిగ్నేచర్లను వినియోగిస్తుందన్న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సదరు నటుడి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్‌లను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అనంతరం పలు సంస్థలు, వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది.