ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ అమెరికాలో పర్యటించిన సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆయనను ఓ మహిళ ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టామని కానీ, అప్పుడు అది ఆమోదానికి నోచుకోలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం మళ్లీ ఏర్పడ్డాక.. తప్పకుండా ఈ బిల్లును ఆమోదిస్తామని, అంతేకాకుండా అమల్లోకి తెస్తామని వెల్లడించారు.