స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 796 పాయింట్లు నష్టపోయి 66,800 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 19,901 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.32%), ఏషియన్ పెయింట్స్ (0.61%), సన్ ఫార్మా (0.45%), ఐటీసీ (0.24%), యాక్సిస్ బ్యాంక్ (0.22%).
టాప్ లూజర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-4.00%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.60%), రిలయన్స్ (-2.21%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.94%), మారుతీ (-1.65%).