2024, రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బుధవారం ప్రకటించారు. ఈ నెల 8న జీ-20 సదస్సులో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని, బైడెన్ ను ఆహ్వానించినట్లు చెప్పారు. ఒకవేళ మోదీ ఆహ్వానాన్ని బైడెన్ అంగీకరిస్తే గణతంత్ర ఉత్సవాలకు అతిథిగా విచ్చేసిన రెండో అమెరికా అధ్యక్షుడిగా నిలుస్తారు.