అజర్ బైజాన్, ఆర్మేనియా మధ్య వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్ లో 2 రోజులుగా కొనసాగుతున్న భీకర దాడులకు తాత్కాలికంగా తెర పడింది. ఇటీవల యుద్ధ మేఘాలు కమ్ముకోగా, రష్యా శాంతి పరిరక్షక దళం మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆర్మేనియా మద్దతున్న వేర్పాటువాద నేతలు ఆయుధాలు వదిలేస్తున్నట్లు ప్రకటించగానే, తాము సైనిక దాడులు నిలిపేసినట్లు అజర్ బైజాన్ అధికారులు తెలిపారు.