ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి స్థానిక గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి యువకుడితో కలిసి డీజే పాటలకు స్టెప్పులేస్తుండగా కుప్పకూలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.