ఒత్తిడి, ఆందోళనలతో మంచి నిద్రకు చాలా మంది దూరమవుతున్నారు. అలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే మంచి నిద్ర పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నచ్చిన మంత్రాన్ని జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందంటున్నారు. గట్టిగా శ్వాస తీసుకుంటే ఒత్తిడి తొలగుతుందంటున్నారు. బెడ్ పై నిటారుగా పడుకుని పొత్తి కడుపుపై చేయి ఉంచి ఊపిరి గట్టిగా పీల్చుకోవాలి. మెల్లగా శ్వాస వదులుతుంటే రీఫ్రెష్ అయి సరైన నిద్ర పడుతుందని చెబుతున్నారు.