తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి బాడవలో దారుణం చోటు చేసుకుంది. కొల్లు సాయికుమార్(24) అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా, అతని భార్య మరోక వ్యక్తి కొల్లు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సాయికుమార్ చెంపపై భార్య గట్టిగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.