ఏపీ అసెంబ్లీలో తొలి రోజు గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. అదే సమయంలో బాలకృష్ణ మీసాలు తిప్పారు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి దమ్ముంటే తన దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. ఏదైనా ఉంటే సినిమాల్లో చూపించుకోవాలని ఇక్కడ కాదని కౌంటర్ ఇచ్చారు.