వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చిన సామెత ఇప్పుడు గుర్తుకు వస్తుందని మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ సమావేశాలలో అన్నారు. అసలు కుంభకోణమే జరుగలేదు, చంద్రబాబుని కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే అరెస్ట్ చేసారు అని టీడీపీ సభ్యులు అంటున్నారు.. రాజకీయ కక్ష సాధింపు లేదని ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. ఇప్పటి వరకు అవినీతి చేసినా దొరకకుండా తప్పించుకున్నారు.. ఇప్పుడు పూర్తి ఆధారాలతో దొరికి పోయారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు తప్పును ఒప్పుకోండి.. బుకాయించకుండా ప్రజల మద్దతు పొందండి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి సలహా ఇచ్చారు .