టీడీపీ అధినేత చంద్రబాబు బయటికి వచ్చే వరకు మా పోరాటం ఆగదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటు ముస్లిం మైనారిటీలు టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వైసీపీ సంబరాలు చేస్తుకుంటుందని ఎద్దేవా చేశారు. బాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆకాంక్షించారు.