దమ్ముంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చకు రావాలని ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ సభ్యుల రౌడీయిజం చూసి భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరన్నారు. విజిల్స్ వేస్తూ దేవాలయం లాంటి అసెంబ్లీని కించపరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిగేందుకు సహకరించాలని.. నోటికొచ్చినట్లు బజారు కూతలు కూస్తే ఎవర్నీ వదిలిపెట్టమన్నారు.