హర్యానా పానిపట్ లో దారుణం వెలుగుచూసింది. నలుగురు దుండగులు ముగ్గురు మహిళలపై వారి కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగిందని, నిందితులు పదునైన ఆయుధాలు కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన కొద్ది దూరంలో ఓ మహిళను హత్య చేసి ఆమె భర్త నుంచి నగదు చోరీ జరిగింది. ఈ 2 ఘటనల్లోనూ నిందితులు ఒకరేనని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa