యూపీ అయోధ్య రైల్వే స్టేషన్ లో ఆగస్ట్ 30న సరయు ఎక్స్ ప్రెస్ కంపార్ట్ మెంట్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరు శుక్రవారం ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. లక్నో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్ కౌంటర్ లో నిందితుడు అనీశ్ హతమయ్యాడు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం నిందితులు తారసపడగా ఎదురుకాల్పులు జరిగాయి. మరో పోలీసకు గాయాలైనట్లు తెలుస్తోంది.