స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విచారణ సమయంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తితో చంద్రబాబు పలు విషయాలు వెల్లడించారు. ‘‘45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు. చట్టాన్ని గౌరవిస్తా. న్యాయం గెలవాలి’’ అని అన్నారు.