పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి (లంపి స్కిన్ డిసీజ్) ప్రబలినప్పుడు రాష్ట్రంలోనూ, బయట ప్రాంతాల నుంచి పశువుల రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించింది. డీ నోటిఫై ఏరియాల్లో ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టినందున రాష్ట్రంలో, బయట ప్రాంతాల నుంచి పశువుల సంచారం, తరలింపుపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.