ఈ నెల 29న సీఎం జగన్ వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత లబ్ధి విడుదల కార్యక్రమానికి కాకినాడ రానున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...... రంగరాయ వైద్యకళాశాల క్రీడా మైదానంలో సభా వేదిక ఏర్పాటు చేశామన్నారు. సభా వేదిక ఏర్పాట్లు, రూట్ మ్యాప్, భోజన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. తక్కువ సమయం ఉన్నందున అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు.