లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా, మదనపల్లె ఆర్డీవో మురళి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.... మదనపల్లె డివిజనలో 45 స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు క్లినిక్‌లు ఉన్నా, వాటికి రిజిసే్ట్రషన, లైసె న్సు జారీపై అవగాహన కల్పించాలన్నారు. కేవలం కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు మూడు సార్లు స్కానింగ్ చేసుకోవచ్చని, అలా అని లింగ నిర్ధారణ కోసం చేస్తే ప్రోత్సహించిన వారితో పాటు చేయించుకున్న వారిని, చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షకు గురవుతారన్నారు.