రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి గోదావరి గట్టు ఇస్కాన్ టెంపుల్ వరకూ గురువారం నిర్వహించిన మారథాన్ 5కే రన్‌ను కలెక్టర్ కె.మాధవీలత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... ప్రధానంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య యువత ఎయిడ్స్ బారిన పడుతున్నట్టు గుర్తించడం జరిగిందన్నారు. సేఫ్ సెక్స్ - సేఫ్ లైఫ్ నినాదంతో ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీకళాశాలల విద్యార్థులతో పాటు కొవ్వూరు, నిడదవోలు, సీతానగరం డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.