విజయనగరం జిల్లా, సాలూరు మండలం తుండ పంచాయతీ పరిధిలో ఉన్న కొడంగివలస గిరిజన తండాలో పోలీసుల పేరు చెప్పి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే.... కొడంగి వలసలో ఒకవైపు మూడిళ్లు, మరోవైపు నాలుగిళ్లు ఉన్నాయి. ఈ గ్రామంలోకి బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులమని చెప్పి నలుగురు వ్యక్తులు మూడిళ్ల వైపు వచ్చి తలుపులు బాదారు. గిరిజనులు తలుపులు తీయ డంతో ఇళ్లలోకి వచ్చి పెట్టెలను సోదా చేసి చోడిపల్లి సుకిల ఇంటిలో తులమున్నర బంగారం.. రూ 20 వేలు నగదు, చోడిపల్లి బందురు ఇంటిలో అర తులం బంగారం.. రూ. 20 వేలు, చోడిపల్లి సన్నమా ఇంటిలో పుస్తెలతాడు, రూ. 50 వేలు దోచుకున్నారని బాధితులు వాపోయారు. వచ్చినవారిలో ఒకరు హెల్మెట్ పెట్టుకోగా మరో ముగ్గురు ముసుగులు ధరించి ఉన్నారని, హిందీ, ఒడియా వచ్చీరానట్టు మాట్లాడారన్నారు. ఈ ఘటనపై సాలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం సాలూరు రూరల్ సీఐ ధనంజయరావు, ఎస్‌ఐ ప్రయోగమూర్తి గ్రామాన్ని సంద ర్శించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.