దీపావళి పండుగకు ఢిల్లీలో గ్రీన్ క్రాకర్లను అనుమతించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బేరియంతో ఫైర్ క్రాకర్ల తయారీ, వినియోగాన్ని అనుమతించాలని పిటిషన్ వేయగా నిరాకరించింది. అన్ని రకాల క్రాకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపింది. 2018 నాటి నిషేధాన్ని అధికారులు యథావిధిగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.