వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మిగతా నిందితులు హాజరయ్యారు. వాదనలు విన్న కోర్టు విచారణను వచ్చేనెల 4కి వాయిదా వేసింది. మరోవైపు.. ఇదే కేసులో ఎస్కార్ట్ బెయిల్ పొందిన నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు 12 రోజులపాటు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.