జమ్మూకశ్మీర్ పోలీస్ శాఖలో డీఎస్పీగా ఉన్న షేక్ ఆదిల్ ముస్తాక్ ఉగ్ర ఆపరేటివ్స్ కు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతనిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని ఇందులో ఇరికించేందుకు యత్నించగా, తాజాగా ముస్తాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకున్నారు. జులైలో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసి విచారించగా ముస్తాక్ తాను నిరంతరం టచ్ లో ఉన్నట్లు వెల్లడించడంతో విచారించి అరెస్ట్ చేశారు.