యూపీ బస్తీ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై గురువారం రాత్రి అత్యాచారం చేసిన దుండగులు, బాధితురాలితో పాటు ఆమె భర్త, పిల్లలకు బలవంతంగా విషం తినిపించారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స పొందుతూ శుక్రవారం భార్యాభర్తలు మరణించారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితులను ఆరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.