స్కిల్ స్కాం కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి విచారించేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే శని, ఆదివారాల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విచారించనున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో 9 మందితో కూడిన బృందం చంద్రబాబును విచారించనుంది. కస్టడీ ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.