జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలి భేటీ కానుంది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్ మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణులతో చర్చలు, ఇతర విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై పరిశీలనకు కేంద్రం ఈ కమిటీ వేసింది.