గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి, ఆ రోజున భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. 15 ఏళ్ల క్రితం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు తీసుకొచ్చారు.