మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బెయిలు పై విడుదలైన ఐదుగురు వలంటీర్లలో నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఆనంద్‌ను తిరిగి భద్రతా దళాలు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేయడంతో అల్లర్లు చెలరేగాయి. దీంతో ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని క్వాకీథేల్ స్ట్రెచ్, సింగ్జమేయి, యురిపోక్ ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందకు పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.