పార్లమెంటు ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై దేశంలోని మహిళలందరూ సంతోషంగా ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ హయాంలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ లభించిందని అన్నారు. తాను రాయ్పూర్ రాగా తనకు మహిళలు ఘనస్వాగతం పలికారని, ప్రధానికి మోదీకి కృతజ్ఞనతలు తెలిపారని చెప్పారు.