గుంతకల్లు పట్టణంలో చిన్నారి కీర్తన మృతికి కారణమైన శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సీజ్ చేసి ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిన్నారి మృతికి నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఆ చిన్నారి కుటుంబానికి యాజమాన్యం 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa