చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమం శుక్రవారం చేపట్టారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని యల్లమ్మ దేవాలయంలో చంద్రబాబు నాయుడు జైలు నుండి క్షేమంగా, త్వరగా సురక్షితంగా విడుదల కావాలని కోరుతూ లేఖలు రాశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.