ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన జీపీఎస్ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం, గుడికల్లు జడ్పీ ఉన్నత పాఠశాల ముందు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ మాట్లాడుతూ.... గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లును రద్దు చేసి పాత పెన్షన్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.50 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యంకాని జీపీఎస్ స్కీం బిల్లును మంత్రి మండలి ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీం ను మాత్రమే అమలు చేయాలని కోరారు. అలానే ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద ధర్నా కి దిగుతామని హెచ్చరించారు.