జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మే 3న ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా తాజాగా పునరుద్ధరించారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినట్లు చెప్పారు. భారత్-మయన్మార్ సరిహద్దులో కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు.