2010లో యూపీఏ హయాంలో కాంగ్రెస్ మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఓబీసీ మహిళలకు అందులో రిజర్వేషన్ కల్పించాలని ఎస్పీ, ఆర్జేడీ కోరాయి. అందుకు అంగీకరించకపోవడంతో ఆ రెండు పార్టీలు తమ మద్దతు ఉపసంహరించాయి. లేకుంటే 2010లోనే అమలులోకి వచ్చేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లక్ష్యాల కోసమే ప్రస్తుతం ఈ బిల్లును ప్రవేశపెట్టింది తప్ప.. అమలు చేసే ఉద్దేశం లేదని ఆరోపించారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌తో ముడి పెట్టినందువల్ల మరో 10 ఏళ్లకే ఈ బిల్లు అమలులోకి వస్తుందని ఆరోపించారు. దేశంలో కుల గణనకు పెరుగుతోన్న డిమాండ్‌ను పక్కదోవ పట్టించేందుకే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు.