అమెరికా ఇండియానా ప్రాంతంలో 6 నెలల పసికందుపై ఎలుకలు 50 సార్లకు పైగా దాడి చేసి చంపేశాయి. ఆగస్ట్ 13న డేవిడ్, ఏంజెల్ షోనాబామ్ దంపతుల 6 నెలల పసికందు ఊయల్లో నిద్రపోతుండగా ఎలుకలు ఎముకలు కూడా బయటకు వచ్చేలా దాడి చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇల్లంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని వారిని, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa